హాజరైన రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

0చూసినవారు
హాజరైన రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించామని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి C, D లలోని ఓటర్లను కేటగిరి Aకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, బిఎల్ఓల ద్వారా ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్