వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన జనగామ జిల్లా ఉప్పుగల్ గ్రామానికి చెందిన గట్టు శ్రీకాంత్ కుటుంబానికి చెందిన 10 ఏళ్ల బాలిక స్నేహిత దర్శనం అనంతరం తప్పిపోయింది. స్థానిక పోలీసులు, బ్లూ కోట్ సిబ్బంది సహాయంతో బాలికను సినిమా రోడ్డులో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికను గుర్తించడంలో కృషి చేసిన బ్లూ కోట్ సిబ్బందిని సీఐ వీర ప్రసాద్ అభినందించారు.