రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని శివంగలపల్లి గ్రామం మీదుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి వెళ్ళే రోడ్డు అధ్వానంగా తయారైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంగళవారం వాపోయారు. అధికారులు స్పందించి, ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోక ముందే రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.