సీసీ రోడ్డు నిర్మాణానికి రూ 1 కోటి నిధులు మంజూరు

2చూసినవారు
సీసీ రోడ్డు నిర్మాణానికి రూ 1 కోటి నిధులు మంజూరు
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం హన్మాన్ తండా నుండి భూక్యా రెడ్డి తండా వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 కోటి ట్రైబల్ వెల్ఫేర్ నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ నిధులను మంజూరు చేశారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా, విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్