రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్, పెండింగ్ ట్రయల్ సిడి ఫైల్స్, గ్రేవ్ కేసుల సిడి ఫైళ్లను, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విధినిర్వహణలో అధికారులు, సిబ్బంది పోటీపడి పనిచేయాలని, అంకితభావంతో పనిచేసేవారికి రివార్డులు, అవార్డులు ఉంటాయని, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఏఎస్పీ సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, డయల్ 100, గల్ఫ్ మోసాలు, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.