రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

1చూసినవారు
రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
బాలరాజుపల్లి గ్రామంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు భూసార పరీక్షల ప్రాముఖ్యత, అధిక యూరియా వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. వానాకాలంలో కూనారం వరి-2, జగిత్యాల సన్నాలు వంటి సన్న రకాలతో పాటు, పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నోడల్ అధికారి ఆర్. సాయికుమార్, శ్రీనివాస్, రూరల్ మండల వ్యవసాయ అధికారిణి వినీత, గ్రామ సర్పంచ్ ప్రేమలత, ఉద్యాన అధికారి లోకేష్, విస్తరణ అధికారిని అనూష, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్