సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి

0చూసినవారు
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించి మద్దతు ధర పొందాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో, జిల్లాలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేములవాడ, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో ఈ కేంద్రాలున్నాయి. రైతులు తమ సమీప కేంద్రాల్లో పత్తిని క్వింటాలుకు రూ. 7689 నుంచి 8110 మద్దతు ధరకు విక్రయించాలని పిలుపునిచ్చారు. 'కపాస్ కిసాన్'లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అధికారులు సమన్వయంతో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటివరకు 42 మంది రైతుల నుంచి 852 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్