ఆలయాల్లో వరుస చోరీలు.. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్‌ఐ

0చూసినవారు
ఆలయాల్లో వరుస చోరీలు.. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్‌ఐ
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్‌ మండలం నూకలమర్రిలోని ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలతో పాటు బాలరాజుపల్లిలోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆలయాల్లో నగదు, ఆభరణాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్