నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరల పెరుగుదల రూపంలో ఆదివారం బ్యాడ్ న్యూస్ అందింది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. సిరిసిల్ల జిల్లాలో స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.302కి చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర 265గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పుడే ఈ స్థాయిలో చికెన్ ధరలు ఉంటే, సంక్రాంతికి ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.