రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు ఎల్లమ్మ మూలమలుపు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన యువకుడు జగిత్యాల జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి అని, తన అక్క పెళ్లికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.