సజావుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

533చూసినవారు
రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ గురువారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు. కులం ధృవీకరణ పత్రాల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల తహసీల్దార్ కు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్