సోమవారం, వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం కోడె మొక్కులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అర్చకులు, వేద పండితులు విశ్వశాంతి కోసం పూజలు చేయడం సంతోషదాయకమని, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి భక్తుల శ్రేయస్సు కోసం ఈ పూజలు చేసినట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో భక్తులు రాజన్న స్వామితో పాటు భీమన్న స్వామివారిని దర్శించుకున్నారు.