రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.