రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. గురువారం తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు, టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్ల లభ్యతపై ఆరా తీశారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, సన్న రకం వడ్లు, రైస్ మిల్లుల కేటాయింపులపై కూడా ఆమె ఆరా తీసి, పలు సూచనలు చేశారు.