మంగళవారం రాత్రి 7:30 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం పూర్తయిన నేపథ్యంలో, వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ సంప్రోక్షణ, పుణ్యాహవాచన పూజలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రహణం ముగియడంతో భోజనాలు స్వీకరించవచ్చని, ప్రధాన ఆలయంలో పుణ్యాహవాచనం చేసిన నీటితో అనుబంధ ఆలయాలలో సంప్రోక్షణ చేసి యధావిధిగా పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చంద్రగ్రహణం కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఏర్పడిందని అర్చకులు వివరించారు.