రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాఘవ కన్స్ట్రక్షన్ అంశంపై వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడటం సరికాదని, అసెంబ్లీలో ఒకే కంపెనీపై పదేపదే ఆరోపణలు చేయడం సభా ప్రమాణాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఏదైనా సంస్థ తప్పు చేస్తే చట్టబద్ధంగా పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రక్షకులే భక్షకులయ్యారని, అందుకే ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారని అన్నారు.