నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్

0చూసినవారు
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆర్ఓ కేంద్రంలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని, అన్ని వివరాలు నింపాలని ఆమె తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎన్నికల నియమావళి, వ్యయం వివరాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించి, కేజీ టూ పీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి, మధ్యాహ్న భోజనం మెనూపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, ఇంచార్జి ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్