నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్

5చూసినవారు
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం బోయినపల్లిలోని ఆర్ఓ కేంద్రంలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా తప్పనిసరి అని, అన్ని వివరాలు నింపాలని ఆమె తెలిపారు. తుది జాబితా ప్రకటించాక అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, వ్యయంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. హెల్ప్ డెస్క్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కూడా తనిఖీ చేసి, ఏర్పాట్లపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్