దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి

7చూసినవారు
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆటల పోటీల కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వారు అందరితో పాటు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో త్వరలో యూడీఐడీ కేంద్రం అందుబాటులోకి రానుందని, డే కేర్ సెంటర్ సేవలు కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. రెగ్యులర్ గా శిబిరాలు నిర్వహిస్తూ అలింకో ద్వారా సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్