కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పం గొప్పదని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలంలోని బండపల్లి, జోగాపూర్ గ్రామాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలన్న బండి సంజయ్ సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు.