రైతన్నలకు మొంథా తుఫాన్ మిగిల్చిన తీరని దుఃఖం

480చూసినవారు
రైతన్నలకు మొంథా తుఫాన్ మిగిల్చిన తీరని దుఃఖం
కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల, నిమ్మపెల్లి, నిజామాబాద్ గ్రామాల్లో మెంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. చేతికందాల్సిన పంటలు నేలమట్టం కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉన్న ధాన్యం కూడా వరదల్లో కొట్టుకుపోవడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. అప్పులు చేసి పండించిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్