గుడిసెతో సహా చుట్టుపక్కల ఖాళీ పాలం బూడిదయ్యాయి

5చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కంచర్ల గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో బస్టాండ్ వద్ద గల గుడిసెతో పాటు చుట్టుపక్కల ఖాళీ స్థలాలు బూడిదయ్యాయి. గ్రామపంచాయతీ బోరు మోటారు వైరు కాలిపోయి సుమారు పదివేల రూపాయల నష్టం వాటిల్లింది. చాట్ల శంకర్ కు చెందిన హోటల్ కూడా పూర్తిగా కాలిపోయి, 20 వేల రూపాయల నష్టం జరిగింది. గ్రామ సర్పంచ్ సామల్ల దేవరాజ్, గ్రామ సిబ్బంది, రైతులు మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.