రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు చొరవతో పనిచేస్తూ రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గురువారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఇతర జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం సేకరణ, తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించడం, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, కొనుగోలు కేంద్రాల నుండి అపరల్ పార్క్ కు హమాలీలను తరలించడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.