మాస శివరాత్రి, శని త్రయోదశి సందర్భంగా ఇది తాజా పరిస్థితి

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో శనివారం మాస శివరాత్రి, శని త్రయోదశి, వేసవి సెలవులు, రెండో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కోడెమొక్కులు, తలనీలాల సమర్పణ, అభిషేకాలు, అన్నపూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం, కుంకుమ పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వంటి సేవలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్