రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తాయని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల్లో పాల్గొని, వేములవాడ పట్టణంలోని శత్రాజ్పల్లి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, ప్రతి వారం ఒక్కో శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.