రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంత పల్లె గ్రామానికి చెందిన ఐతం శ్రీనివాస్, హేమలతల కుమార్తె నూతన వస్త్రాలంకరణ వేడుక వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై నూతన వస్త్రాలు ధరించిన బాలికను ఆశీర్వదించారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, గోస్కుల రవి, నాయకులు బైరగోని రమేష్, డప్పుల అశోక్, తిప్పని శ్రీనివాస్, దుమ్మ అంజయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.