వేములవాడ: హుండీ ఆదాయం వివరాలు

2చూసినవారు
వేములవాడ: హుండీ ఆదాయం వివరాలు
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వరాలయం నందు 13 రోజుల హుండీ ఆదాయం రూ. 1 కోటి 72 లక్షల 76 వేల 469 గా నమోదైంది. ఈ లెక్కింపులో 75 గ్రాముల 300 మిల్లి గ్రాముల మిశ్రమ బంగారం, 06 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి కూడా లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి, ఏసీ కార్యాలయ పరిశీలకులు శ్రీ రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఎస్పీఎఫ్, హోమ్ గార్డ్ సిబ్బంది, మరియు శివరామకృష్ణ భజన మండలి వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్