వేములవాడ: శివశంకర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన

886చూసినవారు
వేములవాడ పట్టణంలోని 10వ వార్డులో శివ శంకర యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు. మహిళా భక్తులు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేసి సేవలో తరించారు. ముందుగా స్వామివారిని విశేష పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. అందరిపై స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని మండపం నిర్వాహకులు ఎడ్ల కమలాకర్ తో పాటు శివ శంకర్ యూత్ సభ్యులు కోరుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్