ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి శివ కళ్యాణోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం, 5వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం, 6వ తేదీన స్వామివారి కళ్యాణం, ఆదివారం, 8వ తేదీన రథోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాల కోసం ఆలయం ముందు భాగంలో రావి చెట్టు వద్ద యాగశాల నిర్మాణం చేపట్టారు.