పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆపరేషన్ సింధూర్ లో ధైర్యముగా పోరాడుతున్న సైన్యానికి మద్దతుగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎం. విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పెడివెల్లి నర్సయ్య, ఆలయ చైర్మన్ ఎతిరాజం నరసయ్య, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.