వేములవాడ మూల వాగుకు జలకళ (వీడియో)

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు గురువారం ఉదయం జలకళను సంతరించుకుంది. తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతంతో పాటు పట్టణంలో కురిసిన వర్షంతో మూలవాగు పరవళ్ళు తొక్కుతూ కనువిందు చేస్తోంది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలు ఈ ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాహం వేగం పుంజుకోవడంతో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :