వేములవాడ పట్టణంలోని కోనాయపల్లి 13వ వార్డులో మూడపల్లి నిలవ్వకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ, వేములవాడ అభివృద్ధి చెందుతుందని, రూ. 150 కోట్లతో రాజన్న ఆలయంతో పాటు బాసర నుండి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోనాయపల్లి నుండి ఉన్న లింక్ రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గత పాలకులు మర్రిపల్లి ప్రాజెక్టును పక్కన పెట్టారని, తాము వచ్చాక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ పూర్తయితే భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.