రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల, దేగావత్ తండా గ్రామాల్లో జరుగుతున్న కబడ్డీ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కార్పోరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి తిలకించారు. క్రీడాకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.