రెసిడెన్సీయల్ పాఠశాలల ముందు వెలుస్తున్న వైన్స్ షాప్స్

2చూసినవారు
రెసిడెన్సీయల్ పాఠశాలల ముందు వెలుస్తున్న వైన్స్ షాప్స్
వేములవాడ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో వైన్ షాపులు వెలుస్తున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. వేములవాడ కోరుట్ల బస్టాండ్ సమీపంలో రెసిడెన్షియల్ పాఠశాలకు అతి సమీపంలో ఉన్న వైన్ షాప్ ను పరిశీలించి, దానిని దూరంగా తరలించాలని కోరారు. రాత్రిపూట విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే షాపులపై చర్యలు తీసుకోవాలని అబ్కారి శాఖ ఎస్ఐకి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. చర్యలు తీసుకోకపోతే ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, రాకేష్, గూపు మధు, రాకేష్, శివ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :