రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు తుది దశకు చేరుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ ఆవునూరి శంకరవ్వ, వార్డు సభ్యులు ఆవునూరి కార్తీక్, కోడం రవి, గొర్రె నర్సవ్వతో పాటు సుమారు 50 మంది ముఖ్య కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో
కాంగ్రెస్ పార్టీలో చేరారు. రైతులకు అండగా నిలుస్తూ, వారు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.