కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: రాజన్న సిరిసిల్ల కలెక్టర్

0చూసినవారు
కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: రాజన్న సిరిసిల్ల కలెక్టర్
అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మే డే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్