
PMSBY స్కీమ్: ఏడాదికి రూ.20 కడితే రూ.2 లక్షల బీమా
కేంద్ర ప్రభుత్వం పేదల ఆర్థిక భద్రత కోసం ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే, ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు బీమా కవరేజ్ లభిస్తుంది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల, యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగిన ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకాన్ని పొందవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది.




