TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కేసులను సిట్‌కు బదిలీ చేశారు. గతంలో నమోదైన కేసులతో పాటు తాజా కేసులపై సిట్ విచారణ చేపట్టనుంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని గతంలో ఫిర్యాదులు అందాయి. ఇక ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్ష కార్యదర్శులను సీఐడీ అరెస్ట్ చేసింది.