TG: హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. కేసీఆర్ విచారణకు రావాలని కోరుతూ CRPC 160 కింద ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసురీత్యా స్టేషన్‌కు రానక్కర్లేదని HYD పరిధిలో కోరిన చోట విచారణ చేస్తామని పేర్కొంది. అయితే కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నందినగర్‌కు వస్తారా? సిట్ అధికారులు అక్కడికే వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.