3 గంటలుగా కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్‌ అధికారులు

73చూసినవారు
3 గంటలుగా కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్‌ అధికారులు
TG: హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు గంటలుగా మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో విచారణ జరుగుతుండగా, భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారని టాక్.

ట్యాగ్స్ :