కేసీఆర్ లేఖతో కంగుతిన్న సిట్ అధికారులు.. విచారణ వాయిదా!

3చూసినవారు
కేసీఆర్ లేఖతో కంగుతిన్న సిట్ అధికారులు.. విచారణ వాయిదా!
మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెక్ పెట్టారు. నామినేషన్ల చివరి రోజున తనను సిట్ విచారణకు పిలవడాన్ని ప్రశ్నిస్తూ కేసీఆర్ లేవనెత్తిన అంశాలతో సిట్ అధికారులు వెనక్కి తగ్గారు. సీర్‌పీసీ ప్రొసీజర్స్‌లోని పలు అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ రాసిన లేఖతో కంగుతిన్న సిట్, న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేసీఆర్ సిట్ విచారణ వాయిదా పడింది.