KCRకు మరో నోటీసు ఇవ్వనున్న సిట్

32చూసినవారు
KCRకు మరో నోటీసు ఇవ్వనున్న సిట్
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో BRS అధినేత, మాజీ సీఎం KCR విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది. నిన్న ఇచ్చిన నోటీసు ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సమావేశాల కారణంగా రాలేనని KCR లేఖ ద్వారా తెలియజేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సిట్, తదుపరి విచారణ తేదీని ఖరారు చేస్తూ రేపు మరో నోటీసు ఇవ్వనుంది. వయసు కారణంగా కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్