మొసలి ముందు కూర్చుని పూజలు.. వీడియో వైరల్

17చూసినవారు
TG: గద్వాల జిల్లా బీచుపల్లిలో పురోహితుడు మొసలికి పూజలు చేసిన వీడియో వైరలవుతోంది. కృష్ణానది ఒడ్డుకు కొట్టుకురావడంతో దాన్ని స్థానికులు పట్టుకొని అధికారులకు సమాచారమిచ్చారు. అయితే మొసలి వరుణదేవుడి వాహనంగా భావించి, వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని నదిలో విడిచిపెట్టారు. అయితే మొసలి ముందు అంత దగ్గరగా కూర్చోవడం ప్రమాదకరమని, దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్