సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చౌకన్‌పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారి శైలజ వడదెబ్బకు గురై మృతి చెందిన విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులకు వెళ్లే మర్రి లక్ష్మణ్, శారద దంపతులు ఈ నెల 4న తమ కూతురు శైలజను వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి మండుతున్న ఎండలోనే ఆడుకుంటూ ఉండిపోయింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర నీరసానికి గురైన శైలజ, రాత్రి తల్లిదండ్రుల పక్కనే పడుకుని నిద్రలోనే చనిపోయింది.