ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో 10 ఏళ్ల వయస్సున్న ఆరో తరగతి బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్టేషనరీ కొనుగోలు చేసేందుకు వెళ్లిన బాలికను ఓ దుకాణంలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి నిందితుడు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం, పోక్సో, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 56 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.