TG: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవపల్లి పరిధి కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం ఓ అస్థిపంజరం బయటపడింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్ శుభ్రం చేస్తుండగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో అస్థిపంజరం బయటపడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆధారాలు సేకరించిన అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.