
లాటరీలో రూ.30 లక్షలు.. విజేత కోసం గాలింపు!
పంజాబ్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రూ.50 పెట్టి లాటరీ కొన్న వ్యక్తికి రూ.30 లక్షల జాక్ పాట్ తగిలింది. కానీ, విజేత ఆచూకీ తెలియరాలేదు. దీంతో నిర్వాహకులు అతడి కోసం గాలింపు చేపట్టారు. మైకులు, డప్పులతో గల్లీల్లో చాటింపు వేయిస్తున్నారు. టికెట్ పై వివరాలు లేకపోవడంతో రైలు ప్రయాణికుడై ఉంటారని భావిస్తున్నారు. నెల రోజుల్లోగా విజేత రాకపోతే ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అదృష్టవంతుడి కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




