ఆస్ట్రేలియాలో స్కైడ్రైవింగ్ సమయంలో అపశృతి చోటుచేసుకుంది. విమానం నుంచి దూకిన స్కైడ్రైవర్ పారాచూట్ విమానం తోకకు చిక్కుకుంది. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో జరిగిన ఈ ప్రమాదం నుంచి స్కైడైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో విమానం తోక భాగం దెబ్బతింది, పైలట్ నియంత్రణ కోల్పోయినప్పటికీ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. స్కైడైవర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. సెప్టెంబర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.