
రూల్స్ బ్రేక్ చేసిన ట్రంప్.. భారీ ఫైన్ వేసిన అధికారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత స్టాక్ ట్రేడింగ్ వ్యవహారంలో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో మిలియన్ల డాలర్ల విలువైన షేర్ల లావాదేవీల వివరాలను సకాలంలో వెల్లడించనందుకు ఆయనకు యూఎస్ ప్రభుత్వ ఎథిక్స్ కార్యాలయం $200 జరిమానా విధించింది. ఇది ఈ ఏడాదిలో ట్రంప్‌కు ఇలాంటి జరిమానా ఎదుర్కోవడం మూడోసారి. ఫిబ్రవరిలో $5 మిలియన్ల నుంచి $25 మిలియన్ల విలువైన షేర్లను విక్రయించి, మార్చిలో తిరిగి పెట్టుబడులు పెట్టారు. ఈ ట్రేడింగ్ టైమింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. వైట్ హౌస్ దీనిని ట్రంప్ ఆర్గనైజేషన్‌కు బదిలీ చేసింది.




