2028 ఆగస్ట్ లోపు SLBC పనులు పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

2చూసినవారు
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ మార్గం పనులను 2028 ఆగస్ట్ లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్